కరోనా కేసుల్లో నేనూ చేరాను.. కరోనా బారినపడిన తర్వాత కిరణ్ మజుందార్ షా ట్వీట్
- స్వయంగా ట్వీట్ చేసి వెల్లడించిన బయోకాన్ ఎండీ
- స్వల్ప లక్షణాలే ఉన్నాయని, త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం
- త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖుల ట్వీట్లు
బయోకాన్ వ్యవస్థాపకురాలు, ఆ సంస్థ ఎండీ కిరణ్ మజుందార్ షా కూడా కరోనా బారినపడ్డారు. తనలో స్వల్ప లక్షణాలే ఉన్నాయని, త్వరలోనే దాని నుంచి బయటపడతానని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కిరణ్ కరోనా బారినపడిన విషయం తెలిసిన ప్రముఖులు ఆమె త్వరగా ఈ మహమ్మారి నుంచి బయటపడాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కిరణ్‌కు చెందిన బయోకాన్ కరోనా చికిత్స కోసం సోరియాసిస్‌కు వాడే ఇటోలిజుమాబ్ అనే ఔషధాన్ని తిరిగి తయారుచేసేందుకు కృషి చేస్తోంది. దీనికి డీజీసీఐ గత నెలలోనే అనుమతి ఇచ్చింది.
అయితే, డీజీసీఐ నిర్ణయం వివాదాస్పదమైంది. కేవలం నాలుగు కొవిడ్ కేంద్రాలలో 30 మంది రోగులపై క్లినికల్ ట్రయల్స్ జరిపి, దాని ఆధారంగా ఇటోలిజుమాబ్ తయారీకి అనుమతి ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, తనకు కరోనా సోకిన విషయాన్ని కిరణ్ స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. తాను కూడా కరోనా కేసుల్లో చేరిపోయానని అయితే, లక్షణాలు మాత్రం స్వల్పంగానే ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలోనే కరోనా నుంచి తాను బయటపడతానని ఆశాభావం వ్యక్తం చేశారు.