శ్రీలంకలో నిన్న దేశవ్యాప్తంగా పోయిన కరెంట్.. తీవ్ర ఇబ్బందులు
- మెయిన్ పవర్ ప్లాంట్ లో సమస్యలు
- ఆరు గంటల తరువాత కొన్ని ప్రాంతాల్లో పునరుద్ధరణ
- తీవ్ర ట్రాఫిక్ జామ్స్ తో ప్రజల ఇబ్బందులు
శ్రీలంకలోని మెయిన్ పవర్ ప్లాంట్ లో టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో దేశవ్యాప్తంగా నిన్న విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగింది. సాంకేతిక సమస్య కారణంగానే పవర్ కట్ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలియజేసిన దేశ విద్యుత్ శాఖా మంత్రి డల్లాస్ అలహప్పెరుమ, దాదాపు ఆరు గంటల తరువాత కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ ను తిరిగి పునరుద్ధరించామని అన్నారు.
కాగా, చాలా ప్రాంతాల్లో విద్యుత్ రావడానికి మరింత సమయం పట్టగా, గ్రామీణ ప్రాంతాల్లో సమస్య ఇంకా తీరలేదని తెలుస్తోంది. విద్యుత్ అంతరాయంతో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సమస్య ఏర్పడి, కొలంబో సహా, అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.