స్పోర్ట్స్ కాంప్లెక్స్ భూమిని వేరే అవసరాల కోసం వినియోగించడం మానుకోవాలి: వర్ల రామయ్య
- విశాఖ ఆగనంపాడులో క్రీడాప్రాంగణం కోసం భూమి కేటాయింపు
- స్పోర్ట్స్ కాంప్లెక్స్ మాత్రమే నిర్మించాలన్న వర్ల
- సీఎం జగన్ ను ఉద్దేశించి ట్వీట్
టీడీపీ నేత వర్ల రామయ్య సీఎం జగన్ ను ఉద్దేశించి తాజాగా ట్వీట్ చేశారు. యువతకు ఉపయోగపడే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం విశాఖలోని ఆగనంపాడులో 80 ఎకరాల భూమిని కేటాయించారని, కానీ ఆ భూమిని ఇతర అవసరాల కోసం వినియోగించాలని భావిస్తున్నారని, ప్రభుత్వం ఆ ఆలోచన విరమించుకోవాలని వర్ల రామయ్య స్పష్టం చేశారు. యువతను ఉత్తమశ్రేణి క్రీడాకారులుగా తయారు చేసే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను మాత్రమే అక్కడ నిర్మించాలని హితవు పలికారు.