కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసిన నారా లోకేశ్

  • చేనేత మండలి రద్దుపై లోకేశ్ లేఖ
  • ప్రభుత్వానికి, కార్మికులకు మధ్య వారధి పోయిందన్న లోకేశ్
  • బోర్డును పునరుద్ధరించాలంటూ విజ్ఞప్తి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన అఖిల భారత చేనేత మండలిని పునఃప్రారంభించాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. ప్రభుత్వానికి, చేనేత కార్మికులకు మధ్య ఉన్న ఏకైక వారధి అఖిల భారత చేనేత మండలి అని, ఇప్పుడా మండలిని రద్దు చేయడం వల్ల చేనేత కార్మికుల అభిప్రాయాలను తెలుసుకునే వీల్లేకుండా పోయిందని  లోకేశ్ పేర్కొన్నారు.

మండలి రద్దుతో... ప్రభుత్వ పాలసీ, ఇతర సలహాలు ఇవ్వడం, కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకునే వ్యవస్థ లేనట్టయిందని వివరించారు. వెంటనే అఖిల భారత చేనేత బోర్డు లేదా, అందుకు సమానమైన వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నట్టు తన లేఖలో విజ్ఞప్తి చేశారు.


More Telugu News