హీరో రామ్ కు బాసటగా నిలిచిన చంద్రబాబు

  • స్వర్ణ ప్యాలెస్ ఘటనపై స్పందించిన రామ్
  • నోటీసులు ఇస్తామన్న విజయవాడ ఏసీపీ
  • ప్రశ్నించే గొంతును అణచివేయాలనుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న చంద్రబాబు
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై హీరో రామ్ పోతినేని స్పందించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ పై కుట్ర జరుగుతోందంటూ ఆయన వ్యాఖ్యానించారు. స్వర్ణ ప్యాలెస్ లో రమేశ్ ఆసుపత్రి కరోనా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించకముందే... ఏపీ ప్రభుత్వం అక్కడ కోవిడ్ సెంటర్ ను నిర్వహించిందని అన్నారు. రామ్ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు, రామ్ వ్యాఖ్యలపై విజయవాడ ఏసీపీ మాట్లాడుతూ, అవసరమైతే రామ్ కు నోటీసులు ఇస్తామని అన్నారు.

ఈ నేపథ్యంలో హీరో రామ్ కు అండగా టీడీపీ అధినేత చంద్రబాబు నిలిచారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని చంద్రబాబు చెప్పారు. ట్వీట్ చేస్తే... విచారణకు అడ్డుపడుతున్నారంటూ నోటీసులు ఇస్తామని బెదిరించడం సరికాదని అన్నారు. ఏపీలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ఏ విధంగా తూట్లు పొడుస్తున్నారో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అని చెప్పారు. ప్రశ్నించే గొంతును అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.


More Telugu News