నిషికాంత్ కామత్ చనిపోయారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం: రితేశ్ దేశ్ ముఖ్
- దర్శకుడు కామత్ కు కరోనా
- చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు
- మీడియా వాస్తవాలు తెలుసుకోవాలన్న రితేశ్
బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే నిషికాంత్ కామత్ మరణించలేదని, ఆయన ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని నటుడు రితేశ్ దేశ్ ముఖ్ వెల్లడించారు. కామత్ మృత్యువుతో పోరాడుతున్నారని, ఆయన కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్ధించుదాం అంటూ ట్వీట్ చేశారు. మీడియా కూడా వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.
నిషికాంత్ కామత్ ఇటీవలే కాలేయ వ్యాధికి గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన కన్నుమూశారంటూ ఈ ఉదయం దర్శకుడు మిలాప్ ట్వీట్ చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఆ తర్వాత మిలాప్ తన ట్వీట్ ను తొలగించి మరో ట్వీట్ చేశారు. నిషికాంత్ బంధువులతో మాట్లాడానని, ఆయన ఇంకా పోరాడుతున్నారని వారు తెలిపారని తన ట్వీట్ లో పేర్కొన్నారు.