కరోనా కంటే భయంతోనే ప్రాణాలు పోతున్నాయి: దేవినేని ఉమ
- ఏపీలో 2,650కి చేరిన మరణాలు
- పాజిటివ్ అనగానే టెన్షన్ పడుతున్నారన్న ఉమ
- ప్రభుత్వ పెద్దలు ఏంచేశారో చెప్పాలంటూ ట్వీట్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ రాష్ట్రంలో కరోనా మరణాలు అధికమవుతుండడం పట్ల స్పందించారు. కరోనా కంటే భయంతోనే ఎక్కువమంది చనిపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా మరణాలు 2,650కి చేరాయని, కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగానే ప్రజలు టెన్షన్ కు లోనవుతున్నారని వివరించారు.
"మనోధైర్యం కలిగించాల్సిన ప్రభుత్వ పెద్దలు ఒక్క క్వారంటైన్ కేంద్రాన్ని గానీ, ఒక్క ప్రభుత్వాసుపత్రిని గానీ సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారా? చెప్పండి జగన్ గారూ!" అంటూ దేవినేని ఉమ ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన తన ట్వీట్ తో పాటు 'భయమే చంపేస్తోంది' అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా జోడించారు.