బాలు సర్ విషమ పరిస్థితిని అధిగమించారు: రజనీకాంత్

  • కరోనా బారినపడిన ఎస్పీ బాలు
  • కొన్నిరోజులుగా ఐసీయూలో చికిత్స
  • వీడియో సందేశం వెలువరించిన రజనీ
అన్ని ప్రధాన భాషల్లోనూ పాటలు పాడి దశాబ్దాలుగా సంగీత ప్రియుల్ని అలరిస్తున్న గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో కొన్నిరోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. విషమ పరిస్థితిలో ఉన్న ఆయన క్షేమంగా తిరిగిరావాలంటూ శ్రేయోభిలాషులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వీడియో సందేశం రిలీజ్ చేశారు. 'ప్రియమైన బాలు సర్, మీరు త్వరగా కోలుకోవాలి' అంటూ ఆకాంక్షించారు.

"ఐదు దశాబ్దాలకు పైగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అనే భాషల్లో పాటలు పాడారు. తన మధురమైన కంఠస్వరంతో కోట్లాదిమందిని అలరించారు. ఇప్పుడాయన కరోనా వైరస్ కలిగించిన విషమ పరిస్థితిని అధిగమించారని తెలిసింది. ఈ వార్త వినగానే నాకు ఎంతో సంతోషం కలిగింది. ఇంకా ఐసీయూలోనే ఉన్న ఆయన త్వరగా కోలుకోవాలంటూ సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడ్ని ప్రార్థించాను" అంటూ తన వీడియోలో పేర్కొన్నారు.


More Telugu News