సుప్రీంకోర్టులో ఏపీ సర్కారుకి మరో ఎదురుదెబ్బ.. ఏపీ ప్రభుత్వ 5 పిటిషన్ల కొట్టివేత
- ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్ 5 జోన్‌పై హైకోర్టు ఉత్తర్వుల సమర్థన
- మధ్యంతర ఉత్తర్వులపై సీజేఐ బోబ్డే సంతృప్తి
- హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచన
- విచారణ త్వరగా పూర్తి చేయాలని హైకోర్టుకు సూచన
సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్ 5 జోన్‌పై హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆర్5 జోన్ ను ప్రకటిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ 355ను రాష్ట్ర హైకోర్టు ఇటీవల సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనితో పాటు పలు అంశాలపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం మొత్తం 5 పిటిషన్లను దాఖలు చేయగా వాటన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టేసింది.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టులో ప్రాథమిక విచారణ, మధ్యంతర ఉత్తర్వులపై సీజేఐ బోబ్డే సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని హైకోర్టులోనే ఏపీ ప్రభుత్వం తేల్చుకోవాలని సూచించారు. అయితే, విచారణ త్వరగా పూర్తి చేయాలని హైకోర్టుకు సూచనలు చేశారు.