వినాయకచవితిని ఇళ్లలోనే జరుపుకోండి.. విగ్రహాల ఏర్పాటుకు అనుమతి లేదు: హైదరాబాద్ పోలీస్ కమిషనర్
- కరోనా, మొహర్రం ఇళ్లలోనే జరుపుకోవాలి
- ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం
- మీ జీవితం దేశానికి కూడా చాలా ప్రధానం
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజు పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జరగనున్న మొహరం, వినాయకచవితి ఉత్సవాలను ఇంట్లోనే చేసుకోవాలని విన్నవించారు. బహిరంగ ప్రదేశాలలో విగ్రహాలను ఏర్పాటు చేయవద్దని చెప్పారు.
ప్రజల ఆరోగ్యం, సంరక్షణే తమకు ముఖ్యమని తెలిపారు. విగ్రహాలను ఏర్పాటు చేయవద్దనే ప్రభుత్వ ఆదేశాలను అందరూ పాటించాలని చెప్పారు. అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని విన్నవించారు. మీ జీవితం మీ కుటుంబంతో పాటు దేశానికి కూడా చాలా ముఖ్యమని... మనం తీసుకునే చిన్న జాగ్రత్తలు మనల్ని సురక్షితంగా ఉంచుతాయని చెప్పారు.