గిటారు వాయిస్తూ.. ‘ఉండిపోరాదే..’ అంటూ పాట పాడిన హీరోయిన్ రాశీఖ‌న్నా

  • ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసిన ముద్దుగుమ్మ
  • తనలోని ప్ర‌త్యేక టాలెంట్‌ని బ‌య‌ట‌కు తీసిన రాశి ఖన్నా
  • ప్రస్తుతం పలు తమిళ సినిమాల్లో నటిస్తోన్న హీరోయిన్
'ఉండిపోరాదే..' పాటను పాడుతూ హీరోయిన్ రాశీ ఖన్నా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.  తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల సినిమాల్లో నటిస్తూ, పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మ‌ల్టీ టాలెంటెడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా షూటింగులు లేక ఇంట్లోనే ఉండిపోతోన్న ఈ అమ్మడు తనలోని ప్ర‌త్యేక టాలెంట్‌ని ఇలా బ‌య‌ట‌కు తీసింది. మ్యూజిక్‌పై మ‌రింత ఫోకస్ పెట్టి  గిటార్   నేర్చుకుంది. తాజాగా గిటార్ ప్లే చేస్తూ 'ఉండిపోరాదే..' పాటను పాడుతూ అలరించింది.


ప్ర‌స్తుతం రాశీ ఖ‌న్నా చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు. పలు త‌మిళ సినిమాల్లో మాత్రమే ఆమె నటిస్తోంది. ఢిల్లీకి చెందిన ఈ భామ ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాల్లో పాట‌లు కూడా పాడిన విషయం తెలిసిందే. గ‌త ఏడాది వచ్చిన ‘ప్ర‌తిరోజూ పండ‌గే’ సినిమాలోనూ ఆమె పాట పాడింది.  



More Telugu News