తెరచుకున్న శబరిమల తలుపులు... భక్తులకు మాత్రం నో ఎంట్రీ!

  • నెల పూజల నిమిత్తం తెరచుకున్న గర్భగుడి 
  • కరోనా భయంతోనే భక్తులను వద్దన్నామన్న టీడీబీ
  • తిరిగి 21న అయ్యప్ప దేవాలయం మూసివేత
నెలవారీ పూజల నిమిత్తం కేరళలోని శబరిమలలో ఉన్న అయ్యప్ప దేవాలయం తలుపులు తెరచుకున్నాయి. మలయాళ 'సింగమ్' నెల ప్రారంభం కాగా, ఆలయ పూజారులు, సంప్రదాయ పూజల తరువాత గర్భగుడి తలుపులను తెరిచారు. కరోనా వైరస్ విజృంభణ కారణంగా భక్తులను మాత్రం అనుమతించడం లేదని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఐదు రోజుల పూజల అనంతరం 21వ తేదీన ఆలయాన్ని మూసి వేస్తామని పేర్కొంది.

కాగా, కేరళలో దాదాపు 1000కి పైగా దేవాలయాలను టీడీబీ నిర్వహిస్తుండగా, ఈ నెల 17న మలయాళ నూతన సంవత్సరం కాగా, ఒక్క శబరిమల మినహా మిగతా అన్ని ఆలయాల్లోనూ భక్తులను అనుమతించారు. శబరిమలకు భక్తులను అనుమతిస్తే, రద్దీ విపరీతంగా పెరుగుతుందని, భక్తుల మధ్య భౌతికదూరం పాటించే పరిస్థితి లేకుంటే, వైరస్ విస్తరిస్తుందని అధికారులు ఆందోళన చెందడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలుత ఆన్ లైన్ విధానంలో భక్తులను అనుమతించాలని భావించినా, ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని పక్కనబెట్టారు.


More Telugu News