సౌదీ అరేబియాపైకి దూసుకొచ్చిన మిసైల్... విజయవంతంగా కూల్చివేసిన సైన్యం!
- ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన హౌతీ దళాలు
- గాల్లోనే పేల్చివేసిన సంయుక్త దళాలు
- తొలుత సౌదీ దాడులు జరిపిందన్న హౌతీ
సౌదీ అరేబియాలోని జనావాసాలపైకి ఇరాన్ వైపు నుంచి వస్తున్న ఖండాంతర క్షిపణిని సౌదీ నేతృత్వంలోని సంయుక్త దళాలు విజయవంతంగా కూల్చివేశాయి. ప్రభుత్వరంగ న్యూస్ ఏజన్సీ 'ఎస్పీఏ' అందించిన వివరాల మేరకు, దక్షిణ సౌదీ అరేబియాలోని నివాసాలు టార్గెట్ గా ఈ క్షిపణిని ప్రయోగించారు. దీన్ని గమనించిన సైన్యం, వెంటనే దాన్ని గాల్లోనే పేల్చివేసింది. మే నెల నుంచి ఇరాన్ కేంద్రంగా పనిచేస్తున్న హౌతీ దళాలు, సరిహద్దులను దాటి సౌదీపై దాడులకు తెగబడుతూ ఉండటం, వైమానిక దాడులు చేస్తుండటంతో, వాటిని సంయుక్త దళాలు అడ్డుకుంటున్నాయి.
కాగా, సౌదీయే తమపై దాడులకు దిగుతోందని, వారి వైమానిక దాడులతో తమ ఫ్యూయల్ ట్యాంకుల తయారీ కేంద్రం పూర్తిగా ధ్వంసమైందని, హౌతీల అధికారిక టీవీ చానెల్ అల్ మసీరా వ్యాఖ్యానించింది. గత గురువారం నుంచి ఇరు దేశాల మధ్యా భీకర దాడులు జరుగుతూ ఉండగా, ఈ దాడులకు డ్రోన్లను వినియోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.