నిన్న సాయంత్రం నుంచి భారీ వరద మధ్యే వ్యక్తి.. హెలికాఫ్టర్ తో వెళ్లి కాపాడిన ఐఏఎఫ్.. వీడియో ఇదిగో
- ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ సమీపంలో ఘటన
- ఓ చెట్టు కొమ్మను పట్టుకుని ఉండిపోయిన వ్యక్తి
- నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం వరకు అక్కడే
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కుండపోత వర్షాలకు చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ సమీపంలో ఖుతాఘాట్ ప్రాంతంలో భారీ వరదలో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు.
వరదలో తనను తాను రక్షించుకోవటానికి ఓ చెట్టు కొమ్మను పట్టుకుని అలాగే ఉండిపోయాడు. నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం వరకు అక్కడే ఉన్నాడు. దీంతో హెలికాప్టర్లో అక్కడకు చేరుకున్న వైమానిక దళ సిబ్బంది తాడును కిందకు వదిలి అతడిని పైకి లాగి, కాపాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ స్మార్ట్‌ఫోన్లలో చిత్రీకరించారు.