నాకు కరోనా సోకింది.. నన్నెవరూ తాకొద్దంటూ లేఖ రాసి గృహిణి ఆత్మహత్య
- శనివారం రాత్రి భర్త, కుమారుడితో కలిసి నిద్రించిన మహిళ
- ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య
- హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
తనకు కరోనా సోకిందని, తనను ఎవరూ తాకొద్దని లేఖ రాసిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్‌లో జరిగిందీ ఘటన.
పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా భర్త, కొడుకు (12)తో కలసి నివసించే చిత్తూరు జిల్లాకు చెందిన గృహిణి (37) ఆదివారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం రాత్రి భోజనాల తర్వాత అందరూ కలిసే నిద్రపోయారు. ఉదయం పది గంటల సమయంలో నిద్ర లేచిన ఆమె కొడుకును నిద్రలేపగా లేవకపోవడంతో పక్కగదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆ తర్వాత నిద్రలేచిన భర్త.. భార్య కనిపించకపోవడంతో వెళ్లి చూడడంతో పక్క గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఓ లేఖ దొరికింది. తనకు కరోనా సోకిందని, తనను ఎవరూ తాకవద్దని అందులో రాసిపెట్టి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె ఎక్కడ పరీక్షలు చేయించుకుంది? ఫలితం ఎప్పుడు వచ్చింది? అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.