కాంగ్రెస్ తాజా నిర్ణయం... అజయ్ మాకెన్ కు రాజస్థాన్ వ్యవహారాల బాధ్యతలు

  • రాజస్థాన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ముఖ్య పాత్ర
  • పరిస్థితిని అధిష్ఠానానికి చేరవేసిన మాకెన్
  • త్రిసభ్య కమిటీలోనూ స్థానం కల్పించిన కాంగ్రెస్
దాదాపు నెల రోజుల క్రితం రాజస్థాన్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడంలో కీలక పాత్రను పోషించిన కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ కు ప్రమోషన్ లభించింది. ఆయన్ను రాజస్థాన్ కాంగ్రెస్ వ్యవహార బాధ్యుడిగా నియమిస్తూ, ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంతవరకూ ఆ స్థానంలో అవినాష్ ఉండేవారు.

తిరుగుబాటు జరిగిన తొలి రోజుల్లో తొలుత పరిశీలకుడిగా అక్కడికి వెళ్లి, పరిస్థితిని మధించి, సమన్వయలోపమే ఈ సంక్షోభానికి కారణమని గమనించి, అధిష్ఠానాన్ని అప్రమత్తం చేసిన అజయ్.. సచిన్ పైలట్ వర్గం తిరిగి పార్టీలోకి రావడంలో తనవంతు పాత్రను పోషించారు. ఆపై ఇటీవల సీఎం అశోక్ గెహ్లాట్ విశ్వాస తీర్మానం నెగ్గిన సంగతి తెలిసిందే. ఆపై పార్టీలోని సమస్యలను పరిష్కరించేందుకు సోనియా నియమించిన త్రిసభ్య కమిటీలోనూ అజయ్ మాకెన్ సభ్యుడిగా ఉన్నారు. ఇదే కమిటీలో ఆయనతో పాటు అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ లను సోనియా నియమించిన సంగతి తెలిసిందే.


More Telugu News