దారుణంగా పడిపోయిన పసిడి దిగుమతులు
- ఏప్రిల్-జులై మధ్య 81.22 శాతం క్షీణించిన దిగుమతులు
- అదుపులోకి వచ్చిన వాణిజ్య లోటు
- భారత్ నుంచి ఆభరణాల ఎగుమతుల్లోనూ దారుణ క్షీణత
దేశంలో పసిడి దిగుమతులు గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. బంగారం, వెండి ధరలకు రెక్కలు రావడంతో ఒకవైపు అమ్మకాలు పడిపోగా, మరోవైపు, దిగుమతులు కూడా దారుణంగా పడిపోయాయి. గతేడాది ఏప్రిల్-జులై మధ్య కాలం నాటి దిగుమతులతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 81.22 శాతం తగ్గి 247 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 18,590 కోట్లు)కు పడిపోయాయి. వెండి దిగుమతులదీ అదే పరిస్థితి. గత నాలుగు నెలల్లో 56.5 శాతం తగ్గి 68.53 కోట్ల డాలర్ల ( దాదాపు 5,185 కోట్లు)కు క్షీణించాయి. ఫలితంగా వాణిజ్య లోటు అదుపులోకి వచ్చింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 5,940 కోట్ల డాలర్ల నుంచి 1,395 కోట్ల డాలర్లకు తగ్గింది.
నిజానికి మార్చి నుంచే పసిడి దిగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి మార్చిలో బంగారం దిగుమతులు 62.6 శాతం, ఏప్రిల్‌లో 99.93 శాతం, మేలో 98.4 శాతం, జూన్‌లో 77.5 శాతం తగ్గాయి. జులైలో మాత్రం స్వల్పంగా పుంజుకుని 4.17 శాతం పెరిగాయి. మరోవైపు, బంగారం, వెండి ధరలు అమాంతం పెరగడంతో అమ్మకాలు కూడా పడిపోయాయి. గతేడాది ఏప్రిల్-జులై మధ్యతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలంలో భారత్ నుంచి ఆభరణాల ఎగుమతులు 66.36 శాతం తగ్గి 417 కోట్ల డాలర్లకు పడిపోయాయి.