అక్రమ మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన బీజేపీ నేతను  సస్పెండ్ చేసిన సోము వీర్రాజు

  • అక్రమ మద్యం రవాణా కేసులో దొరికిన గుడివాక రామాంజనేయులు
  • 2019లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గుడివాక
  • క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు వేస్తున్న సోము
గత ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన గుడివాక రామాంజనేయులు తాజాగా మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర విభాగం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. రామాంజనేయులును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నారు. గుడివాకకు ఈ విషయాన్ని బీజేపీ లేఖ ద్వారా వెల్లడించింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా వ్యవహరించారని ఆ లేఖలో పేర్కొన్నారు.

బీజేపీ ఏపీ చీఫ్ గా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీ గీత దాటిన నేతలను ఏమాత్రం ఉపేక్షించకుండా వేటు వేస్తున్నారు. ఇటీవలే రాజధాని అమరావతి నిరసనల్లో పాల్గొన్నందుకు వెలగపూడి గోపాలకృష్ణను కూడా బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు.


More Telugu News