ఏపీ కరోనా అప్ డేట్: 88 మరణాలు, 8,012 కొత్త కేసులు
- 2,650కి పెరిగిన కరోనా మృతుల సంఖ్య
- తాజాగా 10,117 మందికి కరోనా నయం
- 2 లక్షల మందికి పైగా కరోనా నుంచి విముక్తి
ఏపీలో కరోనా వ్యాప్తి తీరుతెన్నులపై తాజా బులెటిన్ విడుదలైంది. గత 24 గంటల్లో 88 మంది మృత్యువాత పడగా, 8 వేల పైచిలుకు కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో పదేసి మంది మరణించారు. కర్నూలు జిల్లాలో 9 మంది, నెల్లూరు జిల్లాలో 9 మంది చనిపోయారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మృత్యుఘంటికలు మోగించింది. దాంతో మొత్తం మరణాల సంఖ్య 2,650కి పెరిగింది.
ఇక కొత్త కేసుల సంఖ్య ఇటీవల కాలంలో పది వేలకు పైగా నమోదవుతున్న తరుణంలో కొన్నిరోజులుగా క్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 8,012 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 981 కేసులు వచ్చాయి. 10,117 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 85,945 మంది చికిత్స పొందుతున్నారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,89,829 కాగా, వారిలో 2.01 లక్షలమంది కరోనా నుంచి కోలుకున్నారు.