రమేశ్ ఆసుపత్రి వ్యవహారంలో ఆటంకం కలిగిస్తే హీరో రామ్ కు కూడా నోటీసులు ఇస్తాం: విజయవాడ ఏసీపీ
- మీడియాతో మాట్లాడిన విజయవాడ ఏసీపీ
- డాక్టర్ మమత, సౌజన్యలను విచారించినట్టు వెల్లడి
- రమేశ్ అల్లుడు విచారణకు రావాల్సి ఉందన్న ఏసీపీ
విజయవాడ రమేశ్ హాస్పిటల్స్ వ్యవహారంపై ఏసీపీ సూర్యచంద్రరావు మీడియాతో మాట్లాడారు. రమేశ్ ఆసుపత్రి వ్యవహారంలో ఇప్పటివరకు డాక్టర్ మమత, సౌజన్యలను విచారించామని చెప్పారు. రమేశ్ చౌదరి అల్లుడు కల్యాణ్ చక్రవర్తి ఈరోజు విచారణకు రావాల్సి ఉందని, కానీ ఆరోగ్య సమస్యలతో రెండు వారాలు క్వారంటైన్ లో ఉండాల్సి ఉందని ఆయన సమాచారం అందించారని వెల్లడించారు. ఆయన అనారోగ్యం నిజమేనా, కాదా అనేది కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు.
వయోవృద్ధులకు తప్ప మరెవ్వరికీ విచారణ నుంచి మినహాయింపు లేదని, ప్రతి ఒక్కరూ విచారణకు రావాల్సిందేనని, వృద్ధులైతే తామే వారి వద్దకు వెళ్లి విచారిస్తామని ఏసీపీ వివరించారు. రమేశ్ ఆసుపత్రి వ్యవహారాన్ని తాము ఎంతో తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు జరుపుతున్నామని, ఆటంకం కలిగించాలని చూస్తే హీరో రామ్ కు కూడా నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. విచారణలో అంతరాయాలు సృష్టించాలనుకునే ఎవరికైనా నోటీసులు పంపుతామని అన్నారు.