జేసీ ప్రభాకర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
- అట్రాసిటీ కేసులో విచారణ
- దళిత సీఐ దేవేంద్రను దూషించారని ఆరోపణలు
- కడప జైలు నుంచి పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
- ఆసుపత్రిలో వైద్య పరీక్షలు
అట్రాసిటీ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు ఒక్కరోజు కస్టడీకి తీసుకోవడానికి నిన్న కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు ఈ రోజు కస్టడీకి తీసుకున్నారు. ఆయనను కడప జైలు నుంచి తీసుకుకెళ్లి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి, అనంతరం అక్కడి నుంచి మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు.
ఆయనను తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు ఆయనను తిరిగి కడప జైలుకు తరలించనున్నారు. దళిత సీఐ దేవేంద్రను దూషించి బెదిరించిన కేసులో ఆయనపై ఇటీవల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే.