వాజ్‌పేయి వీడియోను పోస్ట్‌ చేసి ప్రధాని మోదీ నివాళులు

  • ఈ రోజు వాజ్‌పేయి రెండో వర్థంతి
  • ఆయనకు నివాళులు
  • ఆయన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు
  • ఆయన పాలనలోనే భారత్‌ అణు శక్తిగా ఎదిగింది
దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయిని గుర్తు చేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ రోజు వాజ్‌పేయి రెండో వర్ధంతని ఆయన గుర్తు చేస్తూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు. ఆ మహనీయుడి సేవలను దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.

దేశ ప్రధానిగా ఉన్న సమయంలో వాజ్‌పేయి ఎన్నో సేవలు అందించారని మోదీ అన్నారు. ఆయన పాలనలోనే భారత్‌ అణు శక్తిగా ఎదిగిందని తెలిపారు. రాజకీయ నాయకుడిగా, ఎంపీగా, ప్రధానిగా ఆయన‌ భారత్‌కు సేవలను అందించారని గుర్తు చేశారు. కాగా, వాజ్‌పేయిని గుర్తు చేసుకుంటూ దేశంలోని ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.


More Telugu News