జపాన్‌పై బ్రిటన్ విజయం సాధించి 75 ఏళ్లు.. స్మారకోత్సవంలో పాల్గొన్న బ్రిటన్ యువరాజు
- 15 ఆగస్టు 1945న బ్రిటన్ చేతిలో ఓడిన జపాన్
- యుద్ధంలో 71 వేల మంది సైనికుల మృతి
- సైనిక యోధులకు బ్రిటన్ యువరాజు, ప్రధాని నివాళులు
రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిన్న నిర్వహించిన వీజే డే స్మారకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బ్రిటన్ యువరాజు చార్జెస్ (71), ఆయన భార్య కమిల్లా యుద్ధ వీరులకు నివాళులు అర్పించారు. మిత్రరాజ్యాల పక్షాన పోరాడిన సైనిక యోధులకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నివాళులు అర్పించారు. 75 ఏళ్ల క్రితం అంటే 15 ఆగస్టు 1945న జపాన్ తన ఓటమిని అంగీకరించి లొంగిపోయే వరకు రెండో ప్రపంచ యుద్ధం కొనసాగింది. ఈ సందర్భంగా రెండు నిమిషాలపాటు దేశవ్యాప్తంగా మౌనం పాటించారు.
జపాన్‌తో జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, భారత్ సహా కామన్‌వెల్త్ దేశాలకు చెందిన 71 వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో జపాన్ చెరలో ఉన్న 12 వేల మంది ఖైదీలు కూడా ఉండడం గమనార్హం. జపాన్ తన ఓటమిని అంగీకరించడానికి మూడు నెలల ముందే అంటే మే 8న ఐరోపాలో నాజీ జర్మనీ సేనలు చిత్తుగా ఓడిపోయాయి. అదే ఏడాది సెప్టెంబరు 2న జపాన్ అధికారికంగా లొంగిపోయింది.
నిజానికీ యుద్ధంలో బ్రిటన్ తొలుత ఓటమి పాలైంది. ఫలితంగా మలేసియా, సింగపూర్, బర్మా (మయన్మార్) నుంచి సైనిక బలగాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. అయితే, ఆ తర్వాత భారత్, ఆఫ్రికాలకు చెందిన 10 లక్షల మంది సైనికులను కూడగట్టిన బ్రిటన్ బలమైన 14వ ఆర్మీని ఏర్పాటు చేసి విజయం సాధించగలిగింది.