జో బిడెన్, కమలా హారిస్‌పై ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు

  • వారిద్దరూ ఎన్నికైతే పోలీస్  స్టేషన్లను తగ్గించేస్తారు
  • నల్లజాతీయురాలు అమెరికన్ల అవసరాలు తీర్చలేదు
  • కమల కంటే నాకే ఎక్కువ మంది భారతీయులు తెలుసు
అమెరికా అధ్యక్ష పోరులో తనకు గట్టి పోటీగా నిలుస్తున్న జో బిడెన్, ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న కమలా హారిస్‌లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సిటీ ఆఫ్ న్యూయార్క్ పోలీస్ బెనెవోలెంట్ అసోసియేషన్ సభ్యులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. వారిద్దరూ గెలిస్తే పోలీస్ స్టేషన్లను రద్దు చేసే చట్టాలను ఆమోదిస్తారని  ఆరోపించారు.

‘‘బిడెన్ అధ్యక్షుడైతే వెంటనే అమెరికాలోని ప్రతి పోలీసు విభాగాన్ని తగ్గించే చట్టాలను ఆమోదిస్తాడు. ఆమె (కమల) అతడి కంటే మరింత అధ్వానంగా ప్రవర్తిస్తారు.  నిజానికి కమలా హారిస్ కంటే నాకే ఎక్కువమంది భారతీయులు తెలుసు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఓ నల్లజాతి మహిళ అమెరికన్ల అవసరాలు తీర్చలేదన్నారు. కమల అమెరికాలో జన్మించలేదు కాబట్టి, ఆమెకు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యే అర్హత లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.


More Telugu News