నిండిపోయిన హుసేన్ సాగర్... నేడు గేట్లు ఎత్తివేసే అవకాశం!

  • లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు
  • గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారుల ఏర్పాట్లు
  • వరద మరింత పెరిగే ప్రమాదం
హైదరాబాద్ లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి, వరద నీరు నాలాల ద్వారా ప్రవహిస్తూ, హుసేన్ సాగర్ లోకి చేరడంతో, జలాశయం నిండుకుండలా మారింది. దీంతో నేడు సాగర్ గేట్లను ఎత్తివేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హుసేన్ సాగర్ గేట్లు ఎత్తివేస్తే, అశోక్ నగర్, హబ్సిగూడ తదితర ఏరియాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వెళ్లే అవకాశాలు ఉండటంతో, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, అక్కడి వారిని అప్రమత్తం చేస్తున్నారు. కాలువ వెంట నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా, జలాశయంలోకి వస్తున్న వరద మరింతగా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


More Telugu News