‘స్పుత్నిక్-వి’ని ఉత్పత్తి చేసేందుకు భారతీయ కంపెనీల ఆసక్తి
- ఇప్పటికే తొలి బ్యాచ్ ఉత్పత్తిని ప్రారంభించిన రష్యా
- మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ సమాచారం కోరిన భారత కంపెనీలు
- జరుగుతున్న చర్చలు
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రష్యా అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు భారతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ మేరకు మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాల సమాచారాన్ని తమకు ఇవ్వాలని రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్టీఐఎఫ్)ను భారత కంపెనీలు కోరాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా రిజిస్టర్డ్ టీకా అయిన స్పుత్నిక్-వి తొలి బ్యాచ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని రష్యా ఇప్పటికే మొదలుపెట్టింది.
రష్యాలో మైక్రో బయాలజీ రీసెర్చ్ సెంటర్ గమలేయ అభివృద్ధి చేసిన టీకాను మార్కెటింగ్ చేయడంతోపాటు, ఎగుమతి చేసే హక్కు కూడా ఆర్డీఐఎఫ్‌కు ఉంది. ఈ నేపథ్యంలో దానితో భారత కంపెనీలు జరుపుతున్న చర్చలు ఫలప్రదమైతే ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని రష్యాలోని భారత రాయబార కార్యాలయ వర్గాలు తెలిపాయి.