ఎవరీ శ్వేతాపాండే... మోదీకి పతాకావిష్కరణలో సహకరించడంతో నెటిజన్ల వెతుకులాట!

  • పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న శ్వేతా పాండే
  • మోదీ పక్కన కనిపించడంతో ట్రెండింగ్ లోకి
  • ప్రస్తుతం మేజర్ హోదాలో ఉన్న శ్వేత
మహిళా సైనికాధికారి శ్వేతా పాండే... నిన్న ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పతాకావిష్కరణ చేసిన వేళ, ఆయనకు సహకరించారు. ఆ కార్యక్రమంలో శ్వేతా పాండే ప్రత్యేక ఆకర్షణగా నిలువగా, ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తిని చూపారు. దీంతో ఆమె పేరు ట్రెండింగ్ లోకి వెళ్లింది.

శ్వేతా పాండే ఇప్పుడు మేజర్ హోదాలో ఉన్నారు. ఆమె ఆర్మీ నేతృత్వంలోని 505 బేస్ వర్క్ షాప్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్. ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాలగా పేరున్న సిటీ మాంటిస్సోరీ స్కూల్ లో విద్యాభ్యాసం చేసిన ఆమె, కెమికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్, బయోలాజికల్ నిపుణురాలు కూడా. పుణెలోని మిలటరీ ఇంజనీరింగ్ కాలేజీలో బేసిక్ సీబీఆర్ఎన్, స్టాఫ్ సీబీఆర్ఎన్  కోర్సులను అభ్యసించారు. ఆమె శిక్షణ చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో సాగగా, ఫైరింగ్ లో తన ప్రతిభతో గర్హ్ వాల్ రైఫిల్ మెడల్ ను పొందారు.


More Telugu News