అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. షాక్ లో అభిమానులు!
- కీలక ప్రకటన చేసిన ధోనీ
- అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన క్రికెట్ దిగ్గజం
- గత కొన్ని రోజులుగా ధోనీ రిటైర్మెంట్ పై పెద్ద ఎత్తున చర్చ
టీమిండియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ధోనీ సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. ధోనీ ప్రకటనతో యావత్ క్రీడాలోకం ఒక్కసారిగా షాక్ కు గురైంది. దేశం తరపున ధోనీ మరింత కాలం ఆడతాడనే ఆశతో ఉన్న అభిమానులు ఈ ప్రకటనతో షాక్ కు గురవుతున్నారు. యావత్ దేశం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకున్న రోజున... ధోనీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
రిటైర్మెంట్ విషయాన్ని ఇన్స్టా గ్రామ్ ద్వారా ధోనీ వెల్లడించాడు. 'మీ అందరి ఎనలేని ప్రేమాభిమానాలకు, మద్దతుకు ధన్యవాదాలు. ఈ సాయంత్రం 7.29 గంటల నుంచి నా రిటైర్మెంట్ అమల్లోకి వస్తుంది' అని క్లుప్తంగా తెలిపాడు.
2019 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్స్ ధోనీ ఆడిన చివరి మ్యాచ్. ఆ మ్యాచ్ లో ఇండియా ఓటమిపాలై, టోర్నీ నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి ధోనీ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది.