జాన్వీ కపూర్ సినిమాపై తీవ్ర విమర్శలు!

  • 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్' సినిమాపై విమర్శలు 
  • సినిమాలో భారత వాయుసేనను కించపరిచే సన్నివేశాలు
  • నిర్మాతలు క్షమాపణలు చెప్పాలన్న జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్
దివంగత సినీనటి శ్రీదేవి కుమార్తెకు తన సినిమా విడుదలైందనే సంతోషం ఏమాత్రం మిగలడం లేదు. తన తాజా చిత్రం 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్' సినిమాపై విమర్శలు వెల్లువెత్తడమే దీనికి కారణం. ఈ చిత్రంలో తమను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డుకు భారత వాయుసేన లేఖ రాసింది.

అంతేకాదు... మాజీ పైలట్ గుంజన్ సక్సేనా కూడా ఎయిర్ ఫోర్స్ కు అనుకూలంగానే మాట్లాడారు. వాయుసేనలో పురుషులతో సమానంగా తనకు సమానమైన అవకాశాలు వచ్చేవని... ఉన్నతాధికారులు కూడా తనకు ఎంతో అండగా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో, సినిమా కథపైనే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కు జాతీయ మహిళా కమిషన్ షాకిచ్చింది.

వాయుసేనను కించపరిచేలా సినిమా ఉందని... ఈ సినిమా ప్రదర్శనను ఆపేయాలని మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ ఒక ట్వీట్ కూడా చేశారు. మన సొంత బలగాలను తక్కువ చేసి చూపేలా సినిమాలు ఎందుకు తీయాలని ఆమె ప్రశ్నించారు. వాయుసేన ప్రతిష్టను దెబ్బతీసేలా సినిమాను తెరకెక్కించినందుకు నిర్మాతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


More Telugu News