ఉత్తరాంధ్రకు వర్ష సూచన... రాగల మూడ్రోజుల్లో భారీ వర్షాలు

  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు
  • 55 కి.మీ వేగంతో గాలులు
  • చేపల వేటకు వెళ్లరాదన్న విపత్తుల శాఖ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో రాగల మూడ్రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విపత్తుల శాఖ పేర్కొంది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆగస్టు 16న ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడతాయని, ఆగస్టు 17న విశాఖ, విజయనగరం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని, ఆగస్టు 18న ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది.

అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం కూడా అలజడిగా ఉంటుందని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. అలలు 4.3 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు.


More Telugu News