అన్నాడీఎంకేలో చిచ్చు.. పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం!

  • వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు
  • సీఎం పదవి కోసం పట్టుబడుతున్న పన్నీర్
  • తన గ్రూపు మంత్రులతో ఈరోజు సమావేశం
జయలలిత మరణం తర్వాత కూడా అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ... చుక్కాని లేని నావలానే ఉంది ఆ పార్టీ పరిస్థితి. ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఇద్దరి మధ్య సీఎం పదవి విషయంలో తీవ్ర పోటీ నెలకొన్నట్టు సమాచారం. సీఎం అభ్యర్థిగా తన పేరును ప్రకటించాలని పన్నీర్ సెల్వం పట్టుబడుతున్నారట. అయితే, దీనికి పళనిస్వామి ససేమిరా అంటున్నారట.

మరోవైపు, ఇప్పటికే తన గ్రూపుతో పన్నీర్ సెల్వం మంతనాలను ప్రారంభించారు. పళనిస్వామిని టార్గెట్ చేస్తూ ఈరోజు పన్నీర్ సెల్వం తన గ్రూపుకు సంబంధించిన మంత్రులతో సమావేశమైనట్టు తెలుస్తోంది. అంతేకాదు, పన్నీర్ సెల్వమే కాబోయే సీఎం అభ్యర్థి అంటూ తమిళనాట పలు చోట్ల పోస్టర్లు కూడా వెలిశాయి. ఈ అంశం ఎంత దూరం వెళ్తుందనేది వేచి చూడాలి.


More Telugu News