వారం క్రితం రుచి, వాసన కోల్పోయాను: సినీ నటి నిక్కీ గల్రానీ
- జ్వరం, గొంతు మంట వచ్చాయి
- టెస్టు చేయుంచుకుంటే కరోనా అని తేలింది
- క్రమంగా కోలుకుంటున్నా
ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పలువురు కరోనా బారిన పడ్డారు. గానగంధర్వుడు ఎస్పీ బాలు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా హీరోయిన్ నిక్కీ గల్రానీకి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె తెలియజేశారు.
తాను రుచి, వాసన కోల్పోయానని... దీనికి తోడు గొంతు మంట, జ్వరం వచ్చాయని... దీంతో గత వారం తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని చెప్పారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలిందని తెలిపారు. ప్రస్తుతం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని... క్రమంగా కోలుకుంటున్నానని చెప్పారు. తాను కోలుకోవాలని కోరుకుంటున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. నిక్కీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లో కూడా నటించారు.