తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ.. 'శతమానం భవతి' దర్శకుడి సినిమా!

 తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ.. 'శతమానం భవతి' దర్శకుడి సినిమా!
  • 'శతమానం భవతి'తో సూపర్ హిట్  
  • తనయుడు సమీర్ హీరోగా తాజా చిత్రం
  • శ్రీహరి తనయుడు మేఘాంశ్ మరో హీరో  
మొదట్లో రచయితగా పేరుతెచ్చుకుని, ఆ తర్వాత దర్శకుడిగా మారి, 'శతమానం భవతి' వంటి సూపర్ హిట్ సినిమాను రూపొందించిన దర్శకుడు సతీశ్ వేగేశ్న. ఆ చిత్రానికి జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న సతీశ్ తాజాగా తన తనయుడిని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ కుర్రాడి పేరు సమీర్ వేగేశ్న. విశేషం ఏమిటంటే, ప్రముఖ నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్, సమీర్ కలసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపొందుతుండడం మరో విశేషం.

ఈ రోజు ఈ చిత్రం వివరాలను దర్శకుడు సతీశ్ ప్రకటించారు. "ఇన్నాళ్లూ ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్లను రూపొందించాను. తొలిసారిగా ఇప్పుడు పూర్తి స్థాయి ఎంటర్ టైనర్ ను తీస్తున్నాను. కరోనా పరిస్థితులు కుదుటపడ్డాక షూటింగుకి వెళతాం' అని సతీశ్ చెప్పారు. ఈ చిత్రాన్ని లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి.సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్నారు.


More Telugu News