అద్భుతమైన కార్యాచరణ అంటూ తమ్ముడ్ని అభినందించిన అల్లు అర్జున్
- దేశీయ ఉత్పత్తులనే ఉపయోగించాలన్న అల్లు శిరీష్
- దేశానికి మద్దతుగా నిలుద్దాం అంటూ పిలుపు
- నిన్ను చూసి గర్విస్తున్నానంటూ బన్నీ ట్వీట్
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా అనేక మార్పులకు కారణమైందని, వివిధ అంశాలపై ప్రజల దృష్టిలో మార్పు తీసుకువచ్చిందని యువ హీరో అల్లు శిరీష్ పేర్కొన్నారు. ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో పూర్తిగా దేశీయ బ్రాండ్లు మాత్రమే కొనుగోలు చేయడం కష్టసాధ్యమేనని అభిప్రాయపవ్డారు.
అయితే, దేశానికి మద్దతుగా నిలిచే సమయం ఇదేనని, పూర్తిగా స్థానికంగా తయారైన బ్రాండ్లు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరిన్ని భారతీయ బ్రాండ్ల వస్తువులను కొనుగోలు చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని అల్లు శిరీష్ పేర్కొన్నారు. తాను సైతం ఈ కార్యాచరణను పాటిస్తున్నానని తెలిపారు.
దీనిపై అల్లు శిరీష్ సోదరుడు అల్లు అర్జున్ స్పందించారు. తమ్ముడ్ని మనస్ఫూర్తిగా అభినందించారు. ఎంత అద్భుతమైన కార్యాచరణ అంటూ ప్రశంసించారు. "భారతీయు ఉత్పత్తులను మాత్రమే వినియోగించాలని, వాటిని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన చాలా గొప్పగా ఉంది. నిన్ను చూసి గర్విస్తున్నాను. జై హింద్!" అంటూ బన్నీ ట్వీట్ చేశారు.