1976లో ఈ మొక్కను నాటాను.. ఇప్పుడు నేలకొరిగింది: అమితాబ్ బచ్చన్

  • ఇటీవల క‌రోనాని జ‌యించిన బిగ్‌ బీ
  • స్వయంగా మరో మొక్క నాటిన అమితాబ్
  • కొన్నేళ్ల క్రితం నాటిన మొక్క భారీ వ‌ర్షాల వల్ల కూలిన వైనం
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌ కరోనా బారిన పడి ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. గతంలో నాటిన  మొక్కల వద్ద తీసుకున్న ఓ ఫొటోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. క‌రోనాని జ‌యించిన అనంతరం ఆయన బ‌య‌ట‌కు వచ్చి తొలిసారి తీసుకున్న ఫొటో ఇది.

అమితాబ్‌ ఇంటి ఆవ‌ర‌ణ‌లో కొన్నేళ్ల క్రితం నాటిన మొక్క బాగా పెరిగింది. అయితే, ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల వ‌ల్ల అది కూలిపోయింది. తాజాగా ఆయన అదే ప్రాంతంలో మ‌రో మొక్కను నాటారు. 1976లో తాను గుల్ మొహ‌ర్ మొక్కను స్వయంగా నాటానని ఆయన తెలిపారు. భారీ వ‌ర్షాల‌కు ఇప్పుడది నేల‌కొరగడంతో, ఆగ‌స్ట్ 12న తన తల్లి పుట్టిన రోజు సంద‌ర్భంగా మళ్లీ ఓ మొక్కను నాటానని బిగ్‌ బీ వివరించారు.                              


More Telugu News