అగ్నిప్రమాదం నేపథ్యంలో రమేశ్ హాస్పిటల్ పై చర్యలు.. కొవిడ్ చికిత్స అనుమతులు రద్దు!
- కరోనా చికిత్స అనుమతులు నిలిపివేత
- నివేదిక రూపొందించిన జాయింట్ కలెక్టర్
- ఇప్పటివరకు కేటగిరీ-ఏ ఆసుపత్రిగా కరోనా చికిత్స అందించిన రమేశ్ హాస్పిటల్
విజయవాడలో రమేశ్ హాస్పిటల్స్ యాజమాన్యం కొవిడ్ కేర్ సెంటర్ గా ఉపయోగించుకుంటున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో అగ్నిప్రమాదం జరిగి 10 మంది కరోనా బాధితులు మరణించడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తాజాగా, ఈ అంశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కఠినచర్యలు తీసుకున్నారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్ ను కొవిడ్ కేర్ సెంటర్ గా ఉపయోగించుకునేందుకు రమేశ్ హాస్పిటల్స్ కు ఇచ్చిన అనుమతిని ఆయన రద్దు చేశారు.
జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని ఓ కమిటీ స్వర్ణ ప్యాలెస్ హోటల్ ను, రమేశ్ హాస్పిటల్ ను పరిశీలించారు. ఈ కమిటీ నివేదికను పరిశీలించిన అనంతరం కలెక్టర్ ఇంతియాజ్ అనుమతులు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు కూడా కరోనా చికిత్స అందించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. రమేశ్ ఆసుపత్రిని కేటగిరీ-ఏ కింద చేర్చి అనుమతి ఇచ్చారు. ఇప్పుడా అనుమతులు రద్దయిన నేపథ్యంలో, తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు రమేశ్ ఆసుపత్రిలో కరోనా చికిత్సలు నిలిపివేయాల్సి ఉంటుంది.