ఈ రెండింటి ద్వారా కరోనా సోకదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- ఆహారం, ప్యాకేజింగ్ ల ద్వారా కరోనా సోకదు
- ఇలాంటి కేసు ఇంత వరకు ఒకటి కూడా రాలేదు
- ఆహార పదార్థాలను కొనుగోలు చేయడానికి భయపడొద్దు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా స్వైర విహారం చేస్తోంది. ఎక్కడ చూసినా కరోనా భయాందోళనలే కనిపిస్తున్నాయి. దేన్ని ముట్టుకోవాలన్నా జనాలు భయపడిపోతున్నారు. కరోనా సోకకుండా ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక కీలక ప్రకటన చేసింది. ఆహారం ద్వారా కరోనా సోకదని ప్రకటించింది. ఆహారం ద్వారా కానీ, ప్యాకేజింగ్ ల ద్వారా కానీ కరోనా సోకినట్టు ఇంత వరకు ఒక్క కేసు కూడా రాలేదని తెలిపింది. ఆహార పదార్థాలను కొనుగోలు చేయడానికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. దీనికి సంబంధించి చైనా చేసిన ఓ పరిశోధనా ఫలితాలను డబ్ల్యూహెచ్ఓ ఆధారాలుగా చూపింది.