ప్రతిపక్షానికి దగ్గరగా నేను ఎందుకు కూర్చున్నానంటే..?: అసెంబ్లీలో సచిన్ పైలట్
- శాసనసభలో మారిన సచిన్ పైలట్ సీటు
- నన్ను బోర్డర్ కు పంపించారు
- సాధారణంగా ధైర్యవంతులను బోర్డర్ కు పంపుతారు
రాజస్థాన్ రాజకీయ సంక్షోభానికి ఈరోజు తెర పడింది. విశ్వాస పరీక్షలో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్గింది. అధిష్ఠానంపై అలకబూని తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్... రాహుల్, ప్రియాంకల సూచనతో చల్లబడ్డారు. దీంతో, రాజస్థాన్ లో ప్రమాదపుటంచుల వరకు వెళ్లిన కాంగ్రెస్ ప్రభుత్వం తన అధికారాన్ని కాపాడుకోగలిగింది.
మరోవైపు అసెంబ్లీలో సచిన్ పైలట్ కూర్చున్న సీటు గురించి బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం గెహ్లాట్ పక్కన కూర్చున్న సచిన్... ఇప్పుడు ప్రతిపక్ష సభ్యులకు దగ్గరగా ఉన్న స్థానంలో ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సచిన్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
'నేను సభలోకి వచ్చిన తర్వాత నా సీటును మార్చినట్టు గమనించి ఆశ్చర్యపోయాను. ఎందుకు ఇలా జరిగిందని అనుకున్నా. అయితే ఆ సీట్లో (అధికారపక్ష సభ్యులు కూర్చునే బెంచ్ ల వైపు వేలితో చూపిస్తూ) కూర్చున్న తర్వాత సురక్షితంగా ఫీల్ అయ్యాను. నన్ను బోర్డర్ కు పంపించారని ఆ తర్వాత అనుకున్నా. సాధారణంగా ధైర్యవంతులను, దృఢమైన వారినే బోర్డర్ కు పంపుతుంటారు. నన్ను కూడా అందుకే పంపించారు' అని సచిన్ వ్యాఖ్యానించారు.