రాజస్థాన్ రాజకీయం: విశ్వాస పరీక్షలో నెగ్గిన గెహ్లాట్ సర్కారు

  • అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన బీజేపీ
  • మూజువాణి ఓటుతో నెగ్గిన అధికార కాంగ్రెస్
  • మళ్లీ దగ్గరైన గెహ్లాట్, సచిన్ పైలట్
అంతర్గత విభేదాలను పరిష్కరించుకుని అసెంబ్లీలో అడుగుపెట్టిన అశోక్ గెహ్లాట్ సర్కారు విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. విపక్ష బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా, గెహ్లాట్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూజువాణి ఓటుతో నెగ్గింది. ఈ బల పరీక్ష ముగిసిన అనంతరం రాజస్థాన్ అసెంబ్లీ ఈ నెల 21కి వాయిదా పడింది. ఇటీవల, సీఎం అశోక్ గెహ్లాట్ కు, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కు మధ్య విభేదాలు ముదిరి పాకాన పడి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ పరిణామాలను సొమ్ము చేసుకునేందుకు బీజేపీ శతవిధాలుగా ప్రయత్నించినా, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్లు రంగంలోకి దిగి సచిన్ పైలట్ ను తిరిగి అశోక్ గెహ్లాట్ చెంతకు చేర్చగలిగారు.


More Telugu News