నష్టాల్లో బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 433 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 122 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3 శాతం వరకు పతనమైన యాక్సిస్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి. మన స్టాక్ మార్కెట్లు నష్టాల బారిన పడటం ఇది వరుసగా మూడో రోజు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 433 పాయింట్లు నష్టపోయి 37,877కి పడిపోయింది. నిఫ్టీ 122 పాయింట్లు కోల్పోయి 11,178కి చేరింది. మెటల్, హెల్త్ కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు మినహా అన్ని సూచీలు నష్టపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (2.04%), ఎన్టీపీసీ (1.38%), టాటా స్టీల్ (1.26%), టైటాన్ కంపెనీ (0.43%), ఇన్ఫోసిస్ (0.24%).

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-2.81%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.68%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.60%), బజాజ్ ఫైనాన్స్ (-2.57%), ఐటీసీ (-2.48%).


More Telugu News