ఈసారి కొత్త జానర్ ప్రయత్నిస్తున్న సాయితేజ్

  • సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో కొత్త చిత్రం
  • మిస్టిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న సినిమా
  • స్క్రీన్ ప్లే అందిస్తున్న సుకుమార్
మొదట్లో హిట్టు కొట్టి, ఆపై కొన్ని పరాజయాలు చవిచూసి మళ్లీ సక్సెస్ ట్రాక్ లో నడుస్తున్న హీరో సాయితేజ్.. ఈసారి కాస్త కొత్త బాటలో నడిచే ప్రయత్నం చేస్తున్నాడు. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ లో నటించనున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. సాయితేజ్ కు ఇది 15వ చిత్రం. ఈ సినిమాకు బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత.

దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో రిలీజైంది. పోస్టర్ చూస్తుంటే ఏదో తాంత్రిక శక్తులకు సంబంధించిన కథాంశం అని అర్థమవుతోంది. దీనిపై హీరో సాయితేజ్ ట్విట్టర్ లో స్పందించాడు. కొత్త జానర్ లో ప్రయత్నిస్తుండడం ఎప్పుడూ ఉద్విగ్నతను కలిగిస్తుందని, అది కూడా తన ఫేవరెట్ ఫిలింమేకర్ సుకుమార్ తో కలిసి పనిచేయనుండడం మరింత ప్రత్యేకం అని పేర్కొన్నాడు.


More Telugu News