ట్రంప్ వల్ల 25 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇజ్రాయెల్, యూఏఈ మధ్య చారిత్రక ఒప్పందం
- దౌత్యపర సంబంధాల్లో సాధారణ పరిస్థితులు
- ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణానికి ఒప్పందం
- ఇజ్రాయెల్, యూఏఈతో ట్రంప్ చర్చలు
- మధ్యప్రాచ్యంలో శుభపరిణామం
దౌత్యపర సంబంధాల్లో సాధారణ పరిస్థితులు, ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి యూఏఈ, ఇజ్రాయెల్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. ఆ ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదరడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారు.
దాదాపు 25 సంవత్సరాల అనంతరం కుదిరిన ఈ శాంతి ఒప్పందం వల్ల మధ్యప్రాచ్య రాజకీయాలు, భద్రత వంటి అంశాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఒప్పందపై అమెరికా, ఇజ్రాయెల్, యూఏఈ తరఫున అగ్రరాజ్యం అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
తనతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్‌లు చర్చలు జరిపి ఓ మంచి నిర్ణయానికి వచ్చారని ట్రంప్ చెప్పారు. ఇరు దేశాల మధ్య పూర్తి సాధారణ సంబంధాలను నెలకొల్పేందుకు వారు అంగీకరించారని తెలిపారు.
49 సంవత్సరాల అనంతరం ఇజ్రయెల్, యూఏఈ దేశాల మధ్య పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు నెలకొననున్నాయని చెప్పారు. అగ్రరాజ్యం చొరవతో ఇరుదేశాలు ఈ ఒప్పందానికి రావటం శుభపరిణామమని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇజ్రయెల్, యూఏఈ ఇరుదేశాలు కరోనా చికిత్స, వ్యాక్సిన్ తయారీ వంటి అంశాల్లో పరస్పరం సహకరించుకుంటాయి.
ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, పర్యాటకం, భద్రత, టెలికాం, శక్తి, వైద్య సాంస్కృతిక రంగాలకు సంబంధించి త్వరలో సంబంధిత అధికారులు సంతకాలు చేయనున్నారు. త్వరలో మరిన్ని అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదరనున్నాయి.