ఎన్నారై ఆసుపత్రి భవనం పైనుంచి దూకేసిన కరోనా రోగి.. పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు
- గుంటూరు జిల్లా చినకాకానిలో ఘటన
- కరోనాకు గత కొన్ని రోజులుగా చికిత్స
- మానసిక వ్యథతోనే అంటున్న పోలీసులు
కరోనాకు చికిత్స పొందుతున్న 66 ఏళ్ల వృద్ధుడు ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరులోని మారుతినగర్‌కు చెందిన వృద్ధుడు గత కొన్ని రోజులుగా ఎన్నారై ఆసుపత్రిలో కరోనాకు చికిత్స తీసుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఈ ఉదయం ఒక్కసారిగా భవనం పైనుంచి కిందికి దూకేశాడు. గమనించిన ఆసుపత్రి సిబ్బంది తీవ్రంగా గాయపడిన అతడిని తీసుకెళ్లి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కరోనా సోకిందన్న మానసిక వ్యథతోనే అతడు ఆత్మహత్యకు యత్నించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.