బెంగళూరులో జరిగిన హింస వంటి ఘటనలు ఏపీలోనూ జరిగే అవకాశం కల్పిస్తున్నారు: సోము వీర్రాజు

  • గతంలో గుంటూరులో పోలీస్ స్టేషన్‌పై దాడి
  • నిందితులపై కేసులను ఎత్తివేశారు
  • సంఘవిద్రోహ శక్తులకు మరిన్ని అవకాశాలను కల్పించారు
  • భవిష్యత్తులో అనేకమంది మనోభావాలను దెబ్బతీస్తుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. 'ప్రజాస్వామ్యంలో చట్టం ముందు ఎంతటివారైనా తప్పుచేస్తే శిక్షించబడాలన్న న్యాయాన్ని అవహేళనచేస్తూ.. ఒకప్పుడు గుంటూరులో పోలీస్ స్టేషన్ పై దాడిచేసిన నిందితులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తూ సంఘవిద్రోహ శక్తులకు మరిన్ని అవకాశాలను కల్పించటం ఈ రాష్ట్ర ప్రభుత్వ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం' అని ఆయన ట్వీట్లు చేశారు.

'ఇది పూర్వ కాంగ్రెస్  కుటిల రాజకీయాలను తలపిస్తుంది.. ఇది చాలా దురదృష్టకరం.. ఇటువంటి నిర్ణయాలు బెంగళూరు నగరంలో జరిగిన  దురదృష్టకర సంఘటనలు, దాడుల వంటివి మన రాష్ట్రంలో మరిన్ని జరిగే అవకాశాలను పెంచుతున్నాయి' అని సోము వీర్రాజు పేర్కొన్నారు.

'రాష్ట్ర ప్రభుత్వం కేవలం కొంతమంది మనోభావాలను మాత్రమే గౌరవిస్తే చాలనుకుంటే దాని పరిణామం భవిష్యత్తులో అనేకమంది మనోభావాలను, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందనటంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు' అని సోము వీర్రాజు తెలిపారు.


More Telugu News