తాము గెలవబోమని తెలిసినా... గెహ్లాట్ పై రాజస్థాన్ బీజేపీ అవిశ్వాస తీర్మానం!

  • తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చిన రెబల్ నేత సచిన్ పైలట్
  • వసుంధరా రాజే నేతృత్వంలో బీజేపీ మీటింగ్
  • గెహ్లాట్ సర్కారు విఫలమైందని చెప్పడం కోసమే అవిశ్వాసం
రాజస్థాన్ బీజేపీ విభాగం అనూహ్య నిర్ణయం తీసుకుంది. తాము గెలవబోమని తెలిసినా, అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. తమలో కలుస్తాడని భావించిన రెబల్ నేత సచిన్ పైలట్ తన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చినట్టు వార్తలు వచ్చిన వెంటనే బీజేపీ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం.

గురువారం నాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే నేతృత్వంలో జరిగిన బీజేపీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొందరు వద్దని వ్యతిరేకించినా, పార్టీ అధిష్ఠానం మాత్రం అవిశ్వాస తీర్మానం పెట్టేందుకే నిర్ణయించిందని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పాలనలో విఫలమైందని ప్రజలకు తెలియజెప్పేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని బీజేపీ వర్గాలు అంటున్నాయి.


More Telugu News