నా తండ్రి యోధుడు.. చికిత్సకు స్పందిస్తున్నారు: ప్రణబ్ కుమారుడు
- మెదడులో ఆపరేషన్ తర్వాత పరిస్థితి విషమం
- ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి
- ప్రణబ్ మరణించారంటూ వస్తున్నవన్నీ వదంతులేనని స్పష్టీకరణ
తీవ్ర అస్వస్థతతో ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చికిత్సకు స్పందిస్తున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ తెలిపారు. తన తండ్రి ఒక పోరాట యోధుడని, చికిత్సకు స్పందిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించాలని శ్రేయోభిలాషులను కోరుతూ ట్వీట్ చేశారు.
మెదడులో ఏర్పడిన కణితిని తొలగించేందుకు ఈ నెల 10న ప్రణబ్‌కు ఆపరేషన్ నిర్వహించారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి విషమించింది. దీనికి తోడు కొవిడ్ కూడా సోకినట్టు నిర్ధారణ అయింది. మరోవైపు, ప్రణబ్ మరణించారన్న పుకార్లు కూడా షికార్లు చేయడంతో అభిజిత్ స్పందించారు. అవి తప్పుడు వార్తలని, తన తండ్రి చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ కూడా స్పందించారు. తన తండ్రి ఆరోగ్యంపై వస్తున్నవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు.