గాలి ద్వారా కరోనా.. రెండు మీటర్ల భౌతికదూరంతో ఉపయోగం లేదు: ఫ్లోరిడా యూనివర్శిటీ పరిశోధకులు
- గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సంక్రమిస్తుంది
- ఇండోర్ లో 4.8 మీటర్ల వరకు వైరస్ విస్తరిస్తుంది
- ముఖాన్ని కవర్ చేసుకోవడంలో జాగ్రత్త అవసరం
ప్రస్తుతం మనం పాటిస్తున్న రెండు మీటర్లు లేదా ఆరు అడుగుల భౌతికదూరం వల్ల ఉపయోగం లేదని ఫ్లోరిడా యూనివర్శిటీ వైరాలజీ విభాగానికి చెందిన పరిశోధకులు అన్నారు. ఇండోర్ వాతావరణంలో 2 నుంచి 4.8 మీటర్ల వరకు గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని తెలిపారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే... ఇప్పుడు అనుసరిస్తున్న మార్గదర్శకాలను సవరించాలని సూచించారు. ఈ మేరకు మెడ్ రెక్సివ్ లో ప్రచురితమైన తమ పరిశోధనాపత్రంలో పేర్కొన్నారు.
దగ్గుతూ, చీదుతూ మాట్లాడేవారి సమీపంలో గాలిని పీల్చడం ద్వారా కరోనా సోకుతుందని పరిశోధకులు చెప్పారు. జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్లకపోవడమే మంచిదని... ముఖాన్ని కవర్ చేసుకోవడంలో కూడా జాగ్రత్త అవసరమని సూచించారు. కార్యాలయాల్లో మనం పాటిస్తున్న రెండు మీటర్ల భౌతికదూరం... ఉద్యోగుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందని చెప్పారు.
గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపించదని తొలుత ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదించిన సంగతి తెలిసిందే. అయితే, గాలి ద్వారా వైరస్ సంక్రమిస్తుందని చెప్పడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని 239 మంది శాస్త్రవేత్తలు లేఖలు రాయడంతో... ఈ వాదనను డబ్ల్యూహెచ్ఓ అంగీకరించింది.