పరిశ్రమలకు ఆధార్ తరహా నెంబర్.. మరో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్!
- ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే 2020 పేరిట వివరాల సేకరణ
- 9 అంశాలపై వివరాలను సేకరించనున్న గ్రామ సచివాలయ సిబ్బంది
- అక్టోబర్ 15వ తేదీ లోగా సర్వేను పూర్తి చేయాలని ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ తరహాలోనే రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమకు ఒక ప్రత్యేక నంబర్ కేటాయించాలని నిర్ణయించింది. ఈ నంబర్ ను 'పరిశ్రమ ఆధార్' పేరుతో కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల సర్వే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 15వ తేదీ లోగా సర్వేను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ సర్వేలో ప్రతి పరిశ్రమకు సంబంధించి కార్మికులు, ముడి సరుకు లభ్యత, మార్కెటింగ్, ఎగుమతులు, దిగుమతులు, విద్యుత్, నీరు, భూమి, ఇతర వనరులకు సంబంధించి వివరాలను సేకరించనున్నారు. మొత్తం 9 అంశాలకు సంబంధించి వివరాలను సేకరించబోతున్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిశ్రమల్లోని వివరాలను గ్రామ సచివాలయ సిబ్బంది సేకరించనున్నారు. ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే 2020 పేరిట ఈ సర్వేను చేపట్టనున్నారు.