భూవివాదంలో సహకరించడంలేదని కక్షగట్టి మూడుగ్రామాలకు రాకపోకలు నిలిపేశారు: నారా లోకేశ్

  • రౌడీరాజ్యంలో ప్రజలకు రక్షణ లేదన్న లోకేశ్
  • వైసీపీ నేతలు ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు
  • అనంతపురం జిల్లా  ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
జగన్ రౌడీ రాజ్యంలో  ప్రజలకు రక్షణ లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి గ్రామంలో భూవివాదంలో సహకరించడంలేదన్న కారణంతో గ్రామస్తులపై కక్షగట్టి అధికార వైసీపీ నేతలు ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడం చూశామని, కానీ ఇప్పుడు ఏకంగా ట్రాక్టర్ ను రోడ్డుకు అడ్డంగా పెట్టి, మరోవైపు మట్టిపోసి మూడు గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారని లోకేశ్ వెల్లడించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, గ్రామాలకు రాకపోకలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.



More Telugu News