టీడీపీ ఇచ్చిన మాట తప్పితే, సీఎం జగన్ ప్రతి హామీనీ నెరవేర్చుతున్నారు: ఏపీ హోంమంత్రి సుచరిత
- గత సర్కారు ఒక్క హామీనీ నెరవేర్చలేదన్న హోంమంత్రి
- పసుపు-కుంకుమతో సరిపెట్టారని విమర్శలు
- తేదీ చెప్పి మరీ సీఎం జగన్ పథకాలు అమలుచేస్తున్నారని కితాబు
ఏపీ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత టీడీపీ సర్కారు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, కానీ సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ పోతున్నారని తెలిపారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన నాటి టీడీపీ సర్కారు చివరికి పసుపు-కుంకుమతో సరిపెట్టిందని దెప్పిపొడిచారు.
కానీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తూ డ్వాక్రా మహిళల్లో సంతోషాన్ని నింపుతున్నారని పేర్కొన్నారు. అభివృద్ధికి సంబంధించి కరోనా సాకుతో తప్పించుకునే వీలున్నా, సీఎం జగన్ మాత్రం తేదీలు ముందే చెప్పి మరీ పేదలకు లబ్ధి చేకూర్చే పథకాలను అమలు చేస్తున్నారని సుచరిత కీర్తించారు. డ్వాక్రా మహిళల రుణాలను నాలుగు విడతల్లో రద్దు చేస్తామన్న హామీని సెప్టెంబరు 11న అమలు చేయనున్నారని తెలిపారు.